Skill development case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్‌ హాజరయ్యారు.

Published : 16 Oct 2023 11:20 IST

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేష్‌ హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చారు.

స్కిల్‌ కేసులో తనను అరెస్టు చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేశారు.  నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఉన్నట్లు సీఐడీ ఏడీజీ మీడియా వద్ద వెల్లడించారని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కిలారు రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని, ఒకవేళ చేరిస్తే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ ప్రకారం నోటీసు ఇచ్చి విచారిస్తామని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణను హైకోర్టు మూసివేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని