Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం లభించనుంది.

Updated : 09 Jun 2024 13:51 IST

హైదరాబాద్‌: కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం లభించనుంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది. దీంతో వారిద్దరూ దిల్లీకి బయల్దేరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. రామ్మోహన్‌నాయుడుకు క్యాబినెట్‌, పెమ్మసానికి సహాయ మంత్రి హోదా దక్కనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని