Kishanreddy: కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

భాజపా నేత, కార్పొరేటర్‌ శ్రవణ్‌ను ప్రభుత్వం కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 19 May 2024 20:04 IST

హైదరాబాద్‌: భాజపా నేత, కార్పొరేటర్‌ శ్రవణ్‌ను ప్రభుత్వం కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరిలో బాధిత కుటుంబాన్ని కిషన్‌రెడ్డి పరామర్శించి.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం సబబుకాదన్నారు. భారాస, కాంగ్రెస్‌ కుమ్మక్కై భాజపాను అడ్డుకునే కుట్రకు పాల్పడుతున్నాయన్నారు. రెండు పార్టీల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మల్కాజిగిరితో పాటు తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయమన్నారు. అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోన్న వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. అంతకుముందు ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌ డివిజన్ మహాత్మనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారాస నేతల దాడిలో గాయపడిన భాజపా కార్యకర్త గోకారం లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని