Kotamreddy: సస్పెండ్‌ చేశాక.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటారా?: కోటంరెడ్డి

తనపై అనర్హత వేటు వేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు.

Updated : 27 Feb 2024 14:57 IST

నెల్లూరు: పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. వారిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఉన్నారు. తనపై అనర్హత వేటు వేయడంపై తాజాగా కోటంరెడ్డి స్పందించారు. ‘‘ఈ విషయం పేపర్‌లో చూసి తెలుసుకున్నా. నాకు ఇంకా స్పీకర్‌ నుంచి లిఖితపూర్వకంగా ఏమీ అందలేదు. ఏడాది కిందటే వైకాపా మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కారణమని అంటారా? వైకాపా కండువా వేసుకున్న నలుగురిని ఆనాడే సస్పెండ్‌ చేసుండాలి కదా?వైకాపాలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలన్న జగన్‌ మాటలు ఏమయ్యాయి?’’అని కోటంరెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని