Nellore: చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్‌ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Mar 2024 13:44 IST

నెల్లూరు: రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్‌ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీతపై సోషల్‌మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి ఓటమి భయంతో మాట్లాడుతున్నారని చెప్పారు. తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని విమర్శిస్తే ఇకముందు తామే సమాధానం చెబుతామన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని తాను ఏడాది క్రితమే బయటపెట్టినట్లు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వివరించారు.

ప్రసన్నకుమార్‌రెడ్డి సభ్యత మరచి మాట్లాడుతున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఓటమి భయంతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. విజయసాయి రెడ్డి ఓటు నేటికీ విశాఖ సీతమ్మధారలో ఉందని.. అక్కడి నుంచి జగన్‌, విజయసాయిరెడ్డిని తరిమేశారని వివరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని