KTR: రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమే: కేటీఆర్‌

హైదరాబాద్‌ నగర ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 30 May 2024 12:50 IST

హైదరాబాద్‌: నగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా భారాస నేతలు చార్మినార్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

‘‘కేసీఆర్‌ పేరు కనిపించకుండా ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోంది. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదు. చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమే. హైదరాబాద్‌ ఐకాన్‌గా చార్మినార్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనలేదు. కేసీఆర్‌ పెట్టిన గుర్తులు మార్చాలని ఆయన చూస్తున్నారు. లోగో మార్పుపై భారాస తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు