KTR: కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్‌

కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 20 May 2024 13:32 IST

ఇల్లందు: కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వ పాలన గురించి 6 నెలల్లోనే ప్రజలకు అర్థమైందని తెలిపారు. భారాస హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేసినట్లు వివరించారు. గత పదేళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్యోగాల కల్పనపై తాము సరిగా ప్రచారం చేసుకోలేదని చెప్పారు. గత 65 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన వైద్య కళాశాలలు 3 మాత్రమేనన్నారు. తాము పదేళ్లలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లినట్లు కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు