KTR: ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులేవీ: కేటీఆర్‌

కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు.

Updated : 24 May 2024 14:10 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. డీజీపీ, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీకి ఆయన ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.

‘‘నా బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్‌ కాంట్రాక్టు వచ్చిందని సీఎం ఆరోపించారు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు కథ అల్లారు. కేంద్ర హోంమంత్రి నకిలీ వీడియోను రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్టు చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైలులో ఎందుకు పెట్టరు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరోవైపు టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గురువారం ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. అధికారికంగా ఇప్పటివరకు సంస్థ విడుదల చేయలేదని పేర్కొన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ  కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో నకిలీదని స్పష్టం చేశారు. దీంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని..  టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని