KTR: దుష్ప్రచారం చేస్తే ఎవరినీ వదిలి పెట్టను: కేటీఆర్‌

మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు.

Published : 03 Apr 2024 16:11 IST

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో, సంబంధంలేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. పదే పదే తనపేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ముగ్గురు నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్‌ ఛానళ్లకు కూడా కేటీఆర్‌ మరో మారు నోటీసులు పంపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని