KTR: తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్‌లో భారాస (BRS) ముఖ్యనేతలు ఇవాళ సమావేశమయ్యారు.

Published : 04 Dec 2023 15:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు. భారాస (BRS) ముఖ్యనేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. దీంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన భారాస ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. పదేళ్లలో భారాస అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భారాస గౌరవప్రదమైన స్థానాలను సాధించిందని, ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని