KTR: ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్‌

ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు.

Published : 21 May 2024 17:36 IST

హైదరాబాద్‌: ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లలో భారాస ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. భారాస ప్రభుత్వం పనిచేసి కూడా చెప్పుకోలేకపోయింది. గత పదేళ్లలో ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. కృష్ణానదిపై కేంద్ర అజమాయిషీకి కేసీఆర్‌ ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నాగార్జునసాగర్‌ను కేంద్రం చేతిలో పెట్టారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు. భారాస నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని