KTR: పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు.

Updated : 19 May 2024 14:53 IST

భువనగిరి: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. భువనగిరిలోని సాయి ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలనూ పరిశీలించండి. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో భారాస విజయం సాధించింది. మేం గుడి పేరుతో ఓట్లు అడగలేదు. ప్రాజెక్టులు కట్టాం.. వాటికి దేవుళ్ల పేర్లు పెట్టాం. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక మూడు మెడికల్‌ కళాశాలలు ఇచ్చాం. అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓటమికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. మేం చేసిన పనిచెప్పుకోలేదు.. రెండు.. కొన్ని వర్గాలను దూరం చేసుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ వైపు బిట్స్‌ పిలానీలో చదువుకున్న అభ్యర్థి.. మరోవైపు బ్లాక్‌ మెయిలర్‌, లాబీయింగ్‌ చేసే అభ్యర్థి ఉన్నారు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని