Chandrababu: చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకున్నారు.

Updated : 05 Jun 2024 12:43 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు.

గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేశినేని చిన్ని, బొండా ఉమా, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి.. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. డోలా బాలవీరాంజనేయ స్వామి, ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు