Lok sabha Elections: కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

Lok sabha Elections: లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.

Updated : 19 Apr 2024 10:40 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా..పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. (Lok sabha Elections)

  • సద్గురు జగ్గీవాసుదేవ్‌ తమిళనాడులో ఓటు వేశారు.
  • ప్రముఖ నటుడు రజనీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఓటు వేయడం ప్రజల కర్తవ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
  • తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేటి ఉదయం ఓటు వేశారు. చెన్నైలోని ఓ పోలింగ్ బూత్ వద్దకు తన సతీమణితో కలిసి వచ్చారు. 
  •  రాధికా-శరత్‌ కుమార్‌ కుటుంబం కూడా ఓటు వేసింది. 
  • భాజపా తమిళనాడు అధ్యక్షుడు, కోయంబత్తూర్ అభ్యర్థి కె.అన్నామలై ఉతుపట్టికి చెందిన కరూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 
  • భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందర్‌రాజన్‌ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘మీ ప్రజాస్వామ్య హక్కును వదులుకోవద్దు. ఓటువేసి, సెల్ఫీ తీసుకొని ఇతరులను ప్రోత్సహించండి’’ అని సూచించారు.
  • కేంద్రమంత్రి, నీలగిరి అభ్యర్థి ఎల్‌ మురుగన్‌.. చెన్నైలోని కోయెంబేడులోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 
  • యోగా గురువు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఎండీ బాలకృష్ణ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • తమిళనాడుకు చెందిన ప్రముఖ నటులు కమల్‌ హాసన్‌, ధనుష్, విజయ్‌ సేతుపతి, అజిత్‌, త్రిపుర సీఎం మాణిక్ సాహా, అరుణాచల్  ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ, రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం దియా కుమారి, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం, రాజస్థాన్‌ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాఠోడ్‌, మణిపుర్ సీఎం బీరెన్‌ సింగ్‌, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, తూత్తుకుడి సిట్టింగ్‌ ఎంపీ కనిమొళి, డిబ్రూగఢ్‌ అభ్యర్థి సర్వానంద సోనోవాల్‌ వంటి ప్రముఖులు తొలిగంటల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బరిలో ఉన్న ప్రముఖులు వీరే..

భాజపా నుంచి నితిన్‌ గడ్కరీ (నాగ్‌పూర్‌), కిరణ్‌ రిజిజు (పశ్చిమ అరుణాచల్‌ ), అన్నామలై (కోయంబత్తూర్‌), తమిళిసై సౌందరరాజన్‌ (చెన్నై దక్షిణం) సర్వానంద సోనోవాల్‌ (డిబ్రూగఢ్‌), భూపేంద్రయాదవ్‌ (అల్వర్‌), జితిన్‌ ప్రసాద (పీలీభీత్‌) బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో గౌరవ్‌ గొగొయ్‌ (జోర్హాట్‌), నకుల్‌నాథ్‌ (ఛింద్వాడా), కార్తీ చిదంబరం (శివగంగ)తో పాటు డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని