Nara Lokesh: లోకేశ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. రాళ్లదాడిలో కానిస్టేబుల్‌కు గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా గునుపూడిలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 05 Sep 2023 22:25 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా గునుపూడిలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా  తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్‌ గునుపూడి రాకముందే వైకాపా కవ్వింపు చర్యలకు దిగింది. గునుపూడి వంతెన వద్ద వైకాపా జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అల్లరి మూకల  రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని  చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అల్లరిమూకలు రాళ్ల దాడి చేస్తున్నా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలదేని తెదేపా నాయకులు ఆరోపించారు. పోలీసులు ముందస్తుగా అల్లరిమూకను కట్టడి చేయకపోవడం వల్లే రాళ్లదాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాన్వాయ్‌లోని పలు వాహనాలను కూడా వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అల్లరి మూకలు పాదయాత్ర జరిగే సమీప ప్రాంతంలోని భవనాలపైకి ఎక్కి రాళ్లు విసిరారు. దీంతో పలువురు యువగళం కార్యకర్తలకు గాయాలయ్యాయి. పాదయాత్రలో రాళ్ల దాడిపై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా  పోలీసుల వైఫల్యంపై తెదేపా నేతలు నిలదీశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని