Sanjay Singh: తిహాడ్‌ను ‘హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్‌’గా మార్చాలని చూస్తున్నారా: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మానసికంగా కుంగదీయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం అన్నారు. 

Updated : 10 Apr 2024 19:10 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మానసికంగా కుంగదీయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) బుధవారం అన్నారు. తిహాడ్‌ జైలును అడాల్ఫ్ హిట్లర్  ‘గ్యాస్ ఛాంబర్స్‌’గా మార్చాలని భాజపా భావిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. దిల్లీ సీఎం తన లాయర్ల ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సందేశం పంపారని పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఆధారంగా విచారణ చేపట్టి, తమ కుటుంబసభ్యులు, న్యాయవాదులను కలవనీయకుండా చేస్తామని తిహాడ్‌ అధికారులు వారిని బెదిరించారని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కేజ్రీవాల్ భాజపా పెట్టే చిత్రహింసలకు తలొగ్గరని అన్నారు.

‘‘నైతిక బాధ్యతగా కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది. అయితే నేరం రుజువు కానందున జైలు నుంచే ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని మేమంటున్నాం. సీఎం ఈరోజు రాజీనామా చేస్తే కాషాయ నేతలు ఆమ్ఆద్మీ పార్టీని అంతమొందిస్తారు. త్వరలో ఇతర భాజపాయేతర ముఖ్యమంత్రులు అందరినీ జైల్లో పెడతారు. రాజీనామాలు అడుగుతారు’’ అని సంజయ్‌ సింగ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని