Madhya Pradesh: కమల్‌నాథ్‌ అవసరం మాకు లేదు: భాజపా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అవసరం తమకు లేదంటూ భాజపా నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ అన్నారు. 

Published : 22 Feb 2024 18:16 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ (Kamal Nath) భాజపా (BJP)లో చేరతారని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర భాజపా నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ (Kailash Vijayvargiya) స్పందిస్తూ ఆయన అవసరం కాషాయ పార్టీకి లేదన్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.

‘‘భాజపాకు కమల్‌నాథ్‌ అవసరం లేదని నేను ఎప్పుడో చెప్పా. అందుకే ఆయన కోసం పార్టీ తలుపు మూసే ఉంటాయి’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్.. ఆయన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌ త్వరలో భాజపాలో చేరనున్నారనే ప్రచారం సాగింది. నకుల్‌ తన అన్ని సోషల్‌ మీడియా ఖాతాల బయోల్లో ‘కాంగ్రెస్‌’ అనే పదాన్ని తొలగించడం  ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. కాంగ్రెస్‌ నేతలకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

నాలుగు చోట్ల ఆప్‌.. మూడు చోట్ల కాంగ్రెస్‌: దిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి..!

ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ వార్తలపై కాంగ్రెస్‌ స్పష్టతనిచ్చింది. కమల్‌నాథ్‌ హస్తం పార్టీలోనే కొనసాగుతారని రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు భన్వర్‌ జితేంద్రసింగ్‌ పేర్కొన్నారు. ఇదంతా భాజపా చేస్తోన్న కుట్రని ఆయన ఆరోపించారు. తాజాగా కమల్‌నాథ్‌పై విజయ్‌ వర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని