Malla Reddy: నేను పార్టీ మారడం లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR)ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆయన వెళ్లారు.

Published : 08 Mar 2024 14:39 IST

హైదరాబాద్‌: భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR)ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆయన వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేటీఆర్‌కు భద్రారెడ్డి తెలిపారు. మరోవైపు గురువారం సీఎం రేవంత్‌ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన కళాశాల భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. 

గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే భద్రారెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిసి పోటీ చేయడం లేదని తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు