Nellore: వైకాపాకు నెల్లూరు మేయర్‌ రాజీనామా

నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌.. వైకాపాకు రాజీనామా చేశారు.

Updated : 11 Jun 2024 07:25 IST

మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతి దంపతులు

నెల్లూరు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్‌ ఛాంబర్‌లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 14 నెలల క్రితం అధికార వైకాపాను వీడినప్పుడు మేమూ ఆయన వెంటే నడిచాం. మేయర్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినా వైకాపా నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి బెదిరింపులు, ఒత్తిళ్లతో వెనక్కు తగ్గాం. వైకాపాలో ఉన్నా మాకు రాజకీయ భిక్షపెట్టిన శ్రీధర్‌రెడ్డిని పల్లెత్తుమాట అనలేదు. కుటుంబ పెద్దగా ఆయన మమ్మల్ని క్షమించి అక్కున చేర్చుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని