LS Polls: వేడెక్కిన కశ్మీర్‌ రాజకీయం..! తలపడనున్న మాజీ సీఎంలు

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌- రాజౌరీలో ఇద్దరు మాజీ సీఎంలు తలపడనున్నారు. గులాంనబీ ఆజాద్‌ ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా.. మెహబూబా ముఫ్తీ సైతం ఇక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

Published : 08 Apr 2024 00:05 IST

శ్రీనగర్: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక్కడి అనంతనాగ్‌- రాజౌరీ స్థానం నుంచి ఇద్దరు మాజీ సీఎంలు నేరుగా తలపడుతున్నారు. డీపీఏపీ అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా.. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) సైతం ఇక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు. దీంతోపాటు మరో రెండు స్థానాలకు తన అభ్యర్థులను పీడీపీ ఖరారు చేసింది. శ్రీనగర్‌ నుంచి పార్టీ యువ విభాగం అధ్యక్షుడు వాహీద్‌ పర్రా, బారాముల్లా నుంచి రాజ్యసభ ఎంపీ మీర్‌ ఫయాజ్‌ బరిలో దిగనున్నారు.

‘జమ్మూలో.. ఇన్నేళ్లు రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదు’ - మోదీ

ఉధంపుర్‌, జమ్మూలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని మెహబూబా వెల్లడించారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలోనే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. కాంగ్రెస్‌తోపాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ శ్రేణులు కూడా తమతో కలిసి రావాలని.. తద్వారా జమ్మూకశ్మీర్ ప్రజల గొంతుకను పార్లమెంటులో వినిపించవచ్చని తెలిపారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూడా పోటీకి దిగడంపై ముఫ్తీ స్పందిస్తూ.. తాను ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లాకే వదిలేశానన్నారు. ‘‘ఆ పార్టీ నేతలు అన్ని స్థానాల్లో పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ.. కనీసం మమ్మల్ని సంప్రదించి ఉండాల్సింది’ అని పేర్కొన్నారు. ‘అనంతనాగ్‌- రాజౌరీ’ స్థానానికి మే 7న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు