Harish Rao: ఆ రాష్ట్రాల్లో రూ.వెయ్యికి మించి పింఛన్‌ ఇవ్వడం లేదు: హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ ఏ డిక్లరేషన్‌ చేసినా ముందుగా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయాలని మంత్రి హరీశ్‌ రావు దుయ్యబట్టారు.

Updated : 27 Aug 2023 15:46 IST

సిద్దిపేట: కాంగ్రెస్‌ ఏ డిక్లరేషన్‌ చేసినా ముందుగా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయాలని మంత్రి హరీశ్‌ రావు దుయ్యబట్టారు. సిద్దిపేటలో బీడీ టేకేదార్లకు నూతన పింఛన్‌ల మంజూరు సహా దివ్యాంగులకు పింఛన్‌ పెంపు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ క్రమబద్దీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే ఎక్కడా పింఛను ఇవ్వడం లేదని విమర్శించారు. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.వెయ్యికి మించి పింఛన్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. తెలంగాణలో గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 167 మంది జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇన్ని చేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మంత్రి హరీశ్‌ రావు కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని