Harish Rao: మంత్రి మండలి సిఫార్సులను తిరస్కరించడం దారుణం: హరీశ్‌రావు

కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం దారుణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 25 Sep 2023 21:45 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మండలి సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌ తమిళిసై (Tamilisai) తిరస్కరించడం దారుణమని మంత్రి హారీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. భారాస సభ్యులుగా ఉన్నారన్న కారణంతో అనర్హులు అనడం సరికాదన్నారు. పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించొచ్చా? అని ప్రశ్నించారు.

‘‘సర్కారియా కమిషన్‌ ప్రకారం గవర్నర్‌ పదవిలో తమిళిపై ఉండకూడదు. కానీ, ఎలా ఉన్నారు? భాజపా నేత గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా?మహేశ్‌ జఠ్మలానీ, సోనాల్‌ మాన్‌సింగ్‌, రాకేశ్‌ సిన్హా భాజపాలో పని చేయలేదా?యూపీలో భారాస నేతలను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక విధానం.. వారితో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానమా? కేంద్రానికి ఒక నీతి.. భాజపాయేతర రాష్ట్రాలకు మరో నీతి ఉంటుందా? తెలంగాణ విషయంలో గవర్నర్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. గవర్నర్‌ కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని