Ponnam Prabhakar: పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్‌

రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 18 Apr 2024 15:55 IST

కరీంనగర్‌: రాష్ట్రానికి పదేళ్లలో భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. భారాస మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఏం చేశారో చెప్పాలన్నారు. గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, రైతులకు బోనస్‌ తప్పకుండా ఇస్తామమన్నారు. కరీంనగర్‌ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు భాజపా కూడా సహకరించిందన్నారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ‘ప్రసాద్‌ పథకం’ నిధులు ఇవ్వలేదని విమర్శించారు.

గడ్డం వంశీని గెలిపించండి: శ్రీధర్‌బాబు

పెద్దపల్లి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ వందలమంది యువతకు ఉపాధి కల్పించారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. భవిష్యత్‌లో మరింతమందికి ఉపాధి కల్పిస్తారని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే వంశీ కృష్ణ రాజకీయాల్లోకి వచ్చారని, ట్రస్టు తరఫున విద్యార్థులను ఆదుకుంటానని తనతో చెప్పారన్నారు. అత్యధిక మెజార్టీతో వంశీని గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని