ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వానివి భారీ తప్పులు: మంత్రి ఉత్తమ్‌

మేడిగడ్డ విషయంలో భారాస తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు.

Published : 01 Mar 2024 14:56 IST

హైదరాబాద్‌: మేడిగడ్డ విషయంలో భారాస తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సత్వర విచారణ జరగాలి. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీ తప్పులు చేసింది. కమీషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది. కొన్ని రిపోర్టులను ప్రభుత్వం ఇవ్వలేదని ఎన్డీఎస్‌ఏ పేర్కొంది. విజిలెన్స్‌ నివేదికపై న్యాయసలహా తీసుకుని కేసులు నమోదు చేస్తాం’ అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని