Marri Janardhan Reddy: కాంగ్రెస్‌ వాళ్లను కాల్చి పడేస్తా: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై నాగర్‌కర్నూల్‌కు చెందిన భారాస ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Aug 2023 14:09 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌పై నాగర్‌కర్నూల్‌కు చెందిన భారాస ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లను కాల్చి పడేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో ‘పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న’ పాదయాత్ర సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. 

‘‘నా జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తా. కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తాను. నేను తలుచుకుంటే కాంగ్రెస్‌ చేయి ఊడిపోతుంది’’ అని మర్రి జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని