TG News: ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్‌డేట్‌: 18వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో మల్లన్న

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది.

Updated : 07 Jun 2024 19:57 IST

నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకూ 48 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 48 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, భారాస అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ (తీన్మార్ మల్లన్న)కు 1,23,709, భారాస (రాకేశ్‌ రెడ్డి)కు 1,04,846 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం తీన్మార్‌ మల్లన్న 18వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ ఎలిమినేషన్‌ తర్వాత కూడా మల్లన్న ఆధిక్యంలో ఉండటంతో గెలుపు ఖాయమనే అంచనాలు ఊపందుకున్నాయి. తుదిఫలితం వెలువడేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని