Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు.

Updated : 08 Dec 2023 13:04 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కవిత ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.  అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత పేర్కొన్నారు.

కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని