Akhilesh: మోదీ 3.0 క్యాబినెట్‌ కూర్పుపై అఖిలేశ్‌ విమర్శలు

నరేంద్ర మోదీ సారథ్యంలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో కొత్తదనం ఏమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు.

Published : 11 Jun 2024 21:16 IST

సైఫాయ్‌: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 3.0 క్యాబినెట్‌ కూర్పుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh yadav) విమర్శలు చేశారు.  మోదీ కొత్త మంత్రివర్గంలో తేదీ, సంవత్సరం మినహా గతం కంటే భిన్నంగా ఏమీ లేదన్నారు.  ఏత్‌ జిల్లా సైఫాయ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎంపీగా గెలుపొందడంతో తాను ఖాళీ చేయబోయే సీటు గురించి త్వరలోనే యూపీ విధానసభకు తెలియజేస్తానన్నారు. అఖిలేశ్‌ మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఏదోఒక స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సిఉంటుంది. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌ను కోరిన కూటమి నేతలు

సోషలిస్టు నేత రామ్‌మనోహర్‌ లోహియా, బీఆర్‌ అంబేడ్కర్‌, నేతాజీ సిద్ధాంతాలు, ఆలోచనల్ని తమ పార్టీ ముందుకుతీసుకెళ్తుందని అఖిలేశ్‌ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటొన్న సమస్యల్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారన్నారు. తమ పార్టీ దేశంలో నంబర్‌ 3 పార్టీగా ఎదగడానికి కారణం కార్యకర్తలేనని వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో 37 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని