NDA: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌ను కోరిన కూటమి నేతలు

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కూటమి నేతలు కలిశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖను అందజేశారు.

Updated : 11 Jun 2024 15:25 IST

విజయవాడ: ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కూటమి నేతలు కలిశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గవర్నర్‌ను కలిశారు. 

విజయవాడలో మంగళవారం ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూటమి శాసనసభాపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబును వారంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి నేతలు గవర్నర్‌ను కలిసి కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని