TSRTC: విలీనంపై సీఎం నాలుగేళ్లు ఆలోచిస్తే.. గవర్నర్‌ ఆలోచించకూడదా?: బండి సంజయ్‌

ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన ఎంపీ బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 05 Aug 2023 15:42 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తానని చెప్పి ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. పాత పథకాలు బంద్‌ చేసి.. కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

‘‘మద్యానికి 3 నెలల ముందే టెండర్లు వేస్తున్నారు. ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. వర్షాల కారణంగా ఎంత నష్టం జరిగిందో ఇప్పటివరకూ వివరాలు లేవు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్‌ నాలుగేళ్లు ఆలోచించారు. అలాంటప్పుడు గవర్నర్‌ బిల్లు గురించి ఆలోచించకూడదా? ఆగమేఘాల మీద గవర్నర్‌ స్టాంప్ వేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలా? బిల్లుతో ఏదైనా నష్టం వస్తే గవర్నర్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గవర్నర్‌ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే విధంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులకు నష్టం కలగవద్దనే గవర్నర్‌ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని