MP Laxman: అసదుద్దీన్ ఒవైసీని గెలిపించాలని కాంగ్రెస్ ప్లాన్: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన, అభద్రతా భావానికి గురవుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 12 Apr 2024 14:28 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతలు ఆందోళన, అభద్రతా భావానికి గురవుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచారంలో అన్ని పార్టీల కంటే భాజపా అభ్యర్థులు దూసుకుపోతున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. రుణమాఫీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. అన్ని హామీలు, గ్యారంటీలు అటకెక్కించి లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల దృష్టిని మరల్చేందుకు, సానుభూతి పొందేందుకు తనపై కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని హైదరాబాద్‌ ఎంపీగా గెలిపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా అధికారం కైవసం చేసుకుంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్, భారాసతో మజ్లిస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా భారాస నేతల్లో అహంకారం తగ్గలేదు. అవకాశవాద రాజకీయాలను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలి. భాజపా అభ్యర్థులను మార్చే ఆలోచన లేదు. త్వరలోనే కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటిస్తాం.. ఉప ఎన్నికలో విజయం సాధిస్తాం’’ అని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని