Raghurama: హింసించిన ఆ ఇద్దరు ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోండి: ప్రధానికి రఘురామ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Published : 01 Nov 2023 13:03 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు. పీవీ సునీల్‌ కుమార్‌, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని తెలిపారు. వారిపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ గతంలో రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లోనే ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి రఘురామ లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని