Janasena: ప్రజాధనంతో జగన్‌ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారు?: నాదెండ్ల

ఈ నెల 28న జనసేన-తెదేపా సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Updated : 23 Feb 2024 15:18 IST

తాడేపల్లిగూడెం: ఈ నెల 28న జనసేన-తెదేపా సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్‌ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు.

‘దిగిపోయే ముందు కూడా జగన్‌ ఖజానా ఖాళీ చేస్తున్నారు. వైకాపా ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు? హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలి. జనసేన, తెదేపాతో భాజపా కలవాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం’’ అని నాదెండ్ల అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు