BRS: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం: నామా

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భారాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) లోక్‌సభలో వెల్లడించారు.

Published : 10 Aug 2023 14:28 IST

దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) లోక్‌సభలో వెల్లడించారు. కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే భారాస ఎంపీలంతా రాజీనామా చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన నామా.. భాజపా ఎంపీలు అబద్ధం చెప్పారన్నారు. సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఈ మేరకు భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబేపై భారాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

‘‘తొమ్మిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం, కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. పైగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోచ్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. ప్రగతిబాటలో పయనిస్తున్న తెలంగాణకు కేంద్రం ఇప్పటికైనా బాసటగా నిలిస్తే మరింత అభివృద్ధి చెందుతాం’’ అని అన్నారు. అయితే, నామా తప్పులు చెబుతున్నారంటూ భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబె పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం రూ.86 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో ఎంపీ నిషికాంత్‌పై నేడు భారాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని