Balakrishna: హిందూపురంలో నామినేషన్‌ వేసిన నందమూరి బాలకృష్ణ

తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

Updated : 19 Apr 2024 16:51 IST

హిందూపురం: తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నామినేషన్‌కు భారీగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. 

హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బాలకృష్ణ అన్నారు. నామినేషన్‌ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. హిందూపురం ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. తమ కుటుంబమంటే ఇక్కడి వారికి ఎంతో అభిమానమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని