Nara Bhuvaneshwari: రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు: నారా భువనేశ్వరి

మహిళలను హింసించడమే వైకాపా ధ్యేయంగా పెట్టుకుందని నారా భువనేశ్వరి ఆరోపించారు. 

Updated : 29 Feb 2024 15:16 IST

అనకాపల్లి: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర అనకాపల్లిలో కొనసాగుతోంది. రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో గురువారం ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తెదేపా వారి కుంటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 50 రోజులపాటు యుద్ధం జరగబోతోందని, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని.. విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళలను హింసించడమే వైకాపా ధ్యేయంగా పెట్టుకుందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు