Nara Bhuvaneswari: వైకాపా చేసే తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు: భువనేశ్వరి

వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

Published : 04 Apr 2024 12:49 IST

కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఆమె కడపలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని