‘నిజం గెలవాలి’ యాత్ర.. తెదేపా కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చిన నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.

Updated : 24 Jan 2024 13:29 IST

జగ్గంపేట: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల్ని ఆమె పరామర్శిస్తున్నారు. జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో తెదేపా కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికసాయం కింద రూ.3లక్షల చెక్కును అందజేశారు. 

నేడు తుని, కాకినాడ నియోజకవర్గాల్లోనూ ఆమె పర్యటించనున్నారు. గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట.. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని