Nara Lokesh: ఏపీలో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం: నారా లోకేశ్‌

ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 13 Apr 2024 12:14 IST

అమరావతి: ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. ఒక్క విద్యాసంస్థనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. గంజాయికి ఏపీ అడ్డాగా మారిందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంటి, చెత్తపన్ను సామాన్యుడికి భారంగా మారాయని లోకేశ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని