Nara Lokesh: వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది: లోకేశ్‌

ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు.  

Updated : 26 Mar 2024 10:24 IST

అమరావతి: ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో అర్చకులపై వైకాపా నేత దాడి ఘటనపై లోకేశ్‌ స్పందించారు.

‘‘కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో అర్చకులపై వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేశాడు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపమా?పూజారులపై దాడి చేసిన వైకాపా నేతను తక్షణమే అరెస్టు చేయాలి. మరో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నా’’ అని లోకేశ్‌ అన్నారు.

దాడిని ఖండించిన అర్చకుల బృందం

కాకినాడలో అర్చకులపై దాడిని అర్చకుల సంఘం ఖండించింది. నిన్న ఇద్దరు అర్చకులపై వైకాపా నేత దాడి చేసిన విషయం తెలిసిందే. అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌పై వైకాపా నేత చంద్రరావు దాడి చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని