చంద్రబాబుతో పవన్‌, పురందేశ్వరి భేటీ.. ఆ రెండు స్థానాలపై చర్చ!

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. అమలాపురం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు.

Updated : 12 Apr 2024 16:26 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. అమలాపురం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ కోయంబత్తూరు పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ప్రస్తుత ప్రచారశైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనపర్తి, ఉండి తదితర స్థానాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైనా కూటమి నేతల మధ్య సమాలోచనలు జరిగే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని