Siddaramaiah: ఎన్డీయేకు మెజార్టీ సీట్లు రావు: సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు ఎన్డీయేకు రావని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Published : 13 Apr 2024 00:02 IST

మైసూరు: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) 400కు పైగా సీట్లతో ఎన్డీయే (NDA) కూటమి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందంటూ భాజపా నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేకు తగినన్ని సీట్లు రావని అభిప్రాయపడ్డారు. అలాగే, విపక్ష ‘ఇండియా’కూటమికి పూర్తి మెజారిటీ రాకపోవచ్చన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 15-20 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

కేజ్రీవాల్‌ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు - పంజాబ్‌ సీఎం

‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన సిద్ధరామయ్య కేవలం ఎన్నికల గురించే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తన పదవికి సంబంధించిన అంశంపైనా స్పందించారు. రెండున్నరేళ్ల తర్వాత సీఎం పీఠాన్ని డీకే శివకుమార్‌ కోసం వదులుకుంటారా? లేదా? అనే ఊహాగానాలపై స్పందిస్తూ..  ‘‘అది పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను సీఎంగా కొనసాగాలని హైకమాండ్ నిర్ణయిస్తే, ఆ పదవిలో కొనసాగుతా. లేదంటే అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటా. నాలుగేళ్ల తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను. రాజకీయంగా మాత్రం క్రియాశీలంగా ఉంటా’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని