LS polls: ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో..నిర్మలమ్మ, జైశంకర్‌

LS polls: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం వారిద్దరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Published : 27 Feb 2024 14:04 IST

దిల్లీ: కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), ఎస్‌ జైశంకర్(S Jaishankar) త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు మరో మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వెల్లడించారు. అయితే వారు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనేదానిపై భాజపా అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

తెలంగాణ నుంచి రాహుల్‌ పోటీ!

‘ఈ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే విషయం దాదాపుగా ఖరారైంది. అయితే వారు ఏఏ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారనేది ఇంకా ఖరారుకాలేదు’ అని జోషి వెల్లడించారు. వారు పోటీ చేసే స్థానాల్లో బెంగళూరు ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ‘ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు నేనెలా సమాధానం చెప్పగలను..?’ అని అన్నారు.

ప్రస్తుతం జై శంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సీతారామన్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారిద్దరు గుజరాత్, కర్ణాటక నుంచి రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని