Bhuvaneswari: నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్‌: భువనేశ్వరి

 నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్‌ అని నారా భువనేశ్వరి అన్నారు.

Published : 13 Apr 2024 18:50 IST

తిరువూరు: ‘నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్‌’ అని నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపు సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్రంలోని 94 నియోజకవర్గాల్లో  9070 కిలోమీటర్లు తిరిగి 203 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించానన్నారు.

‘‘ నిజం గెలవాలి అనే బాధ్యతను నాకు అప్పగించారు. నా యాత్రలో అనేకమంది ప్రజలను కలిసే అదృష్టం దక్కింది. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన జైల్లో ఉన్న 53 రోజులు ఎలా బతికానో నాకే తెలియదు. ప్రజల కోసం బతికే నాయకుడిని జైలులో పెట్టారు. ప్రజలను అభివృద్ధి చెయ్యాలని ఆయన ఎంతగానో ఆలోచించారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ఎన్నోహామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’’ అని  భువనేశ్వరి తెలిపారు.

‘‘ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావేదికని నిర్మిస్తే.. నిరంకుశంగా వ్యవహరించి దానిని వైకాపా ప్రభుత్వం కూల్చేసింది. చంద్రబాబు హయాంలో ఎన్నో వాటర్‌ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఏపీని దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వంలో కొందరు అధికారులు కూడా కిరాతకంగా మారారు. కూటమి జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే. మరో నెల రోజుల్లో మనం కురుక్షేత్ర యుద్ధం చేయబోతున్నాం. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి.. ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలకండి’’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు