తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్‌ వేసిన కీలక నేతలు

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

Updated : 18 Apr 2024 13:52 IST

నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేస్తున్న ఒంగోలు తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తున్నారు. 

ఏపీలోని ఒంగోలు లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు (తెదేపా), విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి భాజపా తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి (తెదేపా), బుట్టా రేణుక (వైకాపా), శ్రీశైలం అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి (వైకాపా).. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (తెదేపా), ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు (తెదేపా) నామినేషన్‌ పత్రాలను ఆర్వోకి సమర్పించారు. 

తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ వేశారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ (భాజపా), నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి (భాజపా) నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు. 

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న భాజపా అభ్యర్థి డీకే అరుణ

కర్నూలు లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న తెదేపా అభ్యర్థి నాగరాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని