Bapatla: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు

బాపట్ల జిల్లా (Bapatla district)లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు.

Published : 07 Dec 2023 09:49 IST

బర్తిపూడి: బాపట్ల జిల్లా (Bapatla district)లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. ఈ ఘటనను తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఖండించారు. అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైకాపా అహంకారానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఓటమి భయంతో వైకాపా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని లోకేశ్‌ ఆరోపించారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైకాపా.. ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదని స్పష్టం చేశారు. 3 నెలల్లో  కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని అన్నారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్.. అంటూ లోకేష్‌ నినదించారు. వాళ్లు ధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదు తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకను అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని