Omar Abdullah: మేం కూటమిలోనే ఉన్నాం.. ఎన్నికల్లో పోటీపై ఎన్‌సీ భిన్న ప్రకటనలు

ఎన్నికల్లో పోటీపై నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి గంటల వ్యవధిలో భిన్న ప్రకటనలు వెలువడ్డాయి.

Published : 15 Feb 2024 23:37 IST

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్ (NC) పార్టీ ‘ఇండియా’ (INDIA) కూటమిలో భాగమని ఆ పార్టీ నేత ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్‌కు కేటాయించడంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ‘‘విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రయోజనం లేదు. భాజపాను ఓడించాలనే లక్ష్యంతో కూటమి ఏర్పాటైంది. మేం ‘ఇండియా’ కూటమిలోనే ఉన్నాం’’ అని ఆయన స్పష్టంచేశారు. అంతకు కొన్ని గంటల ముందు సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుందని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్ధుల్లా ప్రకటించారు.  సీట్ల సర్దుబాటు అంశంలో స్పష్టత రాకపోవడం వల్లనే సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గురువారం శ్రీనగర్‌లోని నవా-ఈ-సుబలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీకి ఝలక్‌.. ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా

ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన కుమారుడు ఒమర్‌ అబ్ధుల్లా ఎన్నికల్లో పోటీపై భిన్న ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ ఎటూ తేల్చకపోవడంతో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, దిల్లీలో ఆప్‌లు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాద్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌ వైఖరిని తప్పుబట్టింది. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కూడా ఎన్‌డీఏ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు