BRS: సికింద్రాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిని ఖరారు చేసింది.

Updated : 23 Mar 2024 17:45 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిని ఖరారు చేసింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.

1991 వరకు కార్పొరేటర్‌గా పనిచేసిన పద్మారావుగౌడ్‌ కాంగ్రెస్‌ నుంచి 2001లో తెరాసలో చేరారు. పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2002లో కారు గుర్తుపై కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావుగౌడ్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గంలో పోటీచేసి.. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఎక్సైజ్‌ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచి ఉపసభాపతి అయ్యారు. 2023లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని