Pawan Kalyan: థియేటర్ల వద్ద డ్యూటీలు వేస్తారు.. పింఛన్ల పంపిణీకి సిబ్బంది లేరా?: పవన్‌

పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 03 Apr 2024 18:12 IST

అమరావతి: పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘మీ వాహనాలపై జాగ్రత్తగా కార్యాలయానికి తీసుకెళ్లి పింఛను ఇప్పించి.. తిరిగి ఇంటి వద్ద దించండి. సామాజిక బాధ్యతగా తీసుకొని సాయం చేయాలి. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నా.

ఏపీ సీఎస్‌ గారూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి. నా సినిమా రిలీజ్‌ అయితే థియేటర్స్‌ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు.. తహసీల్దార్‌ ఫోన్‌ నంబరు ఇస్తారు. కానీ, పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు. వైకాపా నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్‌కి ప్రభుత్వ నిర్ణయాలు బలం చేకూరుస్తున్నాయి’’ అని ట్వీట్‌ చేశారు. గతంలో సినిమా థియేటర్స్‌ వద్ద రెవెన్యూ అధికారులకు విధులు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని పవన్‌ పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు