Janasena: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నిక

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు.

Updated : 11 Jun 2024 13:50 IST

అమరావతి: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.  

భాజపా ఎమ్మెల్యేలతో పురందేశ్వరి భేటీ

మరోవైపు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఎమ్మెల్యేలతో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. అధిష్ఠానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారన్నారు. సీఎం ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భాజపా తరఫున తామంతా సభకు హాజరవుతున్నామని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని